News

పోలీసులు ప్రజలతో మమేకమై.....


 


 


 


పోలీసులు ప్రజలతో మమేకమై పని చేయాలని హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నార్త్ జోన్ డిసిపి ఆధ్వర్యంలో ప్రారంభమైన 'పోలీస్ కమిషనర్స్ క్రికెట్ ట్రోఫి` కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజలలో కలిసిపోయి పని చేసినప్పుడే ప్రజా సమస్యలు స్నేహాపూర్వక వాతవరణంలో త్వరగా పరిష్కరమవుతాయని అన్నారు. పోలీసులు యువతను ఆకర్షించే ఏ కార్యకమ్రాలు చేపట్టినా అది ప్రజల్లో వారిపట్ల విశ్వాసం పెరుగుతుందని అన్నారు. ఈ టోర్నమెంట్‌లో నార్త్ జోన్ పరిధిలో 240 జట్లు పాల్గొనడం హర్షణీయమన్నారు. ఈ లాంటి కార్యకమ్రాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు టి.పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డి, సిపి మహేందర్‌రెడ్డి, తదితరులు త్రివర్ణ పతాకాన్ని చేబూని జెండాను గ్రౌండ్ చుట్టూ తిరిగారు. అనంతరం నాయిని, దత్తాత్రేయ శాంతి కపోతాలు, బెలున్లను ఎగురవేశారు. ఈ పోటీల్లో నాయిని బ్యాటింగ్ చేయగా దత్తాత్రేయ బౌలింగ్ చేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ పరిధిలోని డిసిపి, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.